వాటిని ప్రెస్ చేస్తూ ఝాన్సీ నవ్వులు.. వీడియో చూసిన నెటిజన్లు షాక్!
on Jun 25, 2024

ఫస్ట్ జనరేషన్ యాంకర్ ఝాన్సీ గురించి అందరికి తెలుసు. ఆమె బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. కొంతకాలం క్రితం రిలీజైన సలార్ లో ఆమె ఓబులమ్మగా నటించి మెప్పించారు. ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన మిస్ పర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక తను ఇన్ స్టాగ్రామ్ లో 307K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. తను ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే మొదట 'సొంతం' మూవీలో సునీల్ తో కలిసి చేసిన ఆ కామెడీ వీడియోలు, మాటలు, పంచ్ లు అన్నీ ఇప్పటికీ ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ లో కన్పిస్తుంటాయి.
ఝాన్సీ సినిమాల్లోనే కాదు బయట కూడా యాక్టివ్. ముఖ్యంగా తనకి ఇష్టమైన పనిని, తనకి నచ్చిన పనిని ఇన్ స్టాగ్రామ్ లో చేస్తుంటుంది. అయితే అవన్నీ నేచర్ ని కాపాడే విధంగా ఉంటాయి. అందుకే వాటికి ఎక్కువ ఆదరాభిమానాలు దక్కుతున్నాయి. నేచర్ ని కాపాడాలి.. జంతువులని కాపాడాలి.. ఎకో ఫ్రెండ్లీ అంటూ వినూత్నమైన ఆలోచనలతో రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. అయితే వాటికి కొంతమంది చేసే కామెంట్లు కూడా వైరల్ అవుతుంటాయి.

'హాంక్ వెన్ యూ లవ్ ది ఫుడ్ ' అనే ట్యాగ్ తో గోవాలోని షెర్-ఈ-పంజాబ్ అనే రెస్టారెంట్ ఉంది. దానిని విజిట్ చేసిన ఝాన్సీ అక్కడి ఫుడ్ టేస్ట్ చేసి బాగుందని చెప్పింది. అయితే అక్కడ ఫుడ్ బాగుందని చెప్పాలంటే ఓ టాస్క్ చేయాలి.. అక్కడో రిక్షా ఉంటుంది. దానికి రెండు హారన్ లు ఉంటాయి. వాటిని ప్రెస్ చేయాలి. అయితే ఇందులో వింత ఏంటంటే.. ఆ హారన్ లు ఇప్పటి వాహనాలకి ఉండేవి కావు.. ఓల్డెన్ డేస్ లో బస్సులకి ఉండేవి. వాటిని ప్రెస్ చేసి విపరీతంగా నవ్వేసింది ఝాన్సీ. అందులో అంతగా నవ్వేంతగా ఏం ఉందో .. వీడియో చూసినవాళ్ళకే అర్థం అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. 'రూట్ మ్యాప్ , లొకేషన్ షేరింగ్ అడగని ఒకే ఒక వాహనం' అని ఒకరు కామెంట్ చేశారు. ' ఏంటో అస్సలు అర్థం కారు.. అంత మంచి ఫీల్ ఉంటుందా' అని మరొకరు కామెంట్ చేశారు. అక్క మెను సూపర్ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకా చాలా కామెంట్లు వస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ గా మారింది. మరి అంతగా ఏం ఉందో మీరు చూసేయ్యండి.
anchor jhansi latest video viral, jhansi in goa, anchor jhansi, Latest News on Tv Anchor Jhansi, jhansi in goa video viral, anchor jhansi latest news
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



